సంగారెడ్డి జిల్లా మండలం మల్కాపూర్ గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద కొనసాగుతున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి బుధవారం పరిశీలించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
మల్కాపూర్ గ్రామ శివారులో వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి పరిశీలించి, పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచినీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు, పొలాల వద్ద వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి పనులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
గ్రామంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో యూసుఫ్, ఏపీవో ప్రవీణ్, గ్రామ కార్యదర్శి లీలావతి, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు కూలీలు పాల్గొన్నారు.












