మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 07
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రకృతి సహకరించకపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. మేయర్ మధుకర్ గత మూడు రోజులుగా నీటి సరఫరాను పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రకృతి సహకరించకపోవడంతో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. మేయర్ మధుకర్ గత మూడు రోజులుగా నీటి సరఫరాను పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాళ్లవాగు వద్ద పైప్‌లైన్ లీకేజీని సరిచేయడానికి 100 హెచ్‌పీ మోటార్‌తో నీటిని తోడుతున్నా, అది కష్టతరంగా మారింది. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది.
పైపు బిగింపు పనులపై దృష్టి
శనివారం వరుణుడు సహకరిస్తే, పైపు బిగింపు పనులు పూర్తయితే కష్టాలు తీరనున్నాయని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సైతం మేయర్ మధుకర్ పైపు బిగింపు కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మూడో ప్రయత్నం విఫలమైతే, మరో ప్రత్యామ్నాయ మార్గం వైపు చూడాల్సి వస్తుంది, అప్పుడు గానీ జిల్లా కేంద్ర ప్రజల మంచినీటి సమస్య తీరేలా లేదు.
వాతావరణం సహకరిస్తేనే పరిష్కారం
ప్రస్తుతం మేయర్ మధుకర్ పడుతున్న కష్టానికి తోడు, 24 గంటలు వర్షం పడకుండా వాతావరణం సహకరిస్తే జిల్లా కేంద్ర ప్రజల తాగునీటి కష్టాలు తొలగిపోతాయని మేయర్ పేర్కొంటున్నారు. ఏది ఏమైనా, రాళ్లవాగు వద్ద మేయర్ మధుకర్ గత 3 రోజులుగా తాగునీటి సమస్యను తీర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అధికారుల కృషి
ఇంజనీరింగ్ సిబ్బందితోపాటు కార్పొరేషన్ అధికారులు మేయర్‌కు సహకరిస్తూ, ప్రకృతిపై చేయి సాధించడానికి కృషి చేస్తున్నారు. దైవ సహాయం అందాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు.












