సంగారెడ్డి, 2026-08-07
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఆరోగ్యం, విద్య, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళాశిశు సంక్షేమ శాఖల్లో జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించిన మంత్రి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

వైద్య, ఆరోగ్య సేవల బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించిన మంత్రి, జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ స్థానంలో నకిలీ వైద్యుడు విధులు నిర్వహించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. కంకోల్, సింగీతం పీహెచ్‌సీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, బర్దిపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పీహెచ్సీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణ, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసులపై సమీక్షించి, మందులు, వైద్య పరికరాలు, మౌలిక వసతులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ ఎంసీహెచ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, అంగన్వాడీలు, పీహెచ్‌సీలు, జెడ్పీహెచ్ఎస్లలో తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో తాగునీటి సరఫరాపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. మంజీర, సింగూరు ప్రాజెక్టుల నీటిమట్టం, ఇంటెక్ వెల్ల ద్వారా సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో చర్చించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.