కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలం లింగాయపల్లి గ్రామంలోని గోరిగోని కుంటలో ప్రమాదవశాత్తు పడి తండ్రీకుమార్తె మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన సోమిశెట్టి రజిత (35), ఆమె తండ్రి సుంకరి పెద్ద నర్సింలు (65) నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
లింగాయపల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి రజిత (35), మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్కు చెందిన ఆమె తండ్రి సుంకరి పెద్ద నర్సింలు (65) గోరిగోని కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
రజిత భర్త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమెకు సహాయంగా ఉండేందుకు తండ్రి పెద్ద నర్సింలు కుమార్తె వద్దకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరూ గ్రామంలోని గోరిగోని కుంట వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి, తదుపరి చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలు రజితకు భర్తతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి, తాత ఒకేసారి మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యే పరిస్థితి ఏర్పడటం స్థానికులను కలచివేసింది.

