తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గృహ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మంచిర్యాలలో జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఇళ్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, రఫతూల్లా, మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజుతో పాటు పలువురు సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి కేటాయించిన ఇళ్ల వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు.












