జిన్నారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నాగార్జున గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
జిన్నారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నాగార్జున గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి బదిలీపై వెళ్లడంతో, ఆయన స్థానంలో హైదరాబాద్ నగరం నుంచి నాగార్జున గౌడ్ను నియమించారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు.












