భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నషా ముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ ప్రచారంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ సొసైటీ మాదకద్రవ్యాల నిర్మూలనకు సన్నద్ధమైంది. ఈనెల 28న హైదరాబాద్లో నశాముక్త భారత అభియాన్ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నషా ముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ పేరుతో వంద వారాల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో, భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయస్థాయి ఉద్యమమైన నశాముక్త భారత అభియాన్ గురించి రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల వివరించారు. ఈ ఉద్యమం ద్వారా యువత, విద్యార్థులు, మహిళల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, డ్రగ్స్ బారిన పడిన వారికి కౌన్సిలింగ్, వైద్య పరీక్షలు, డి-అడిక్షన్ కేంద్రాల ద్వారా మెరుగైన చికిత్స అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలు.
ఈనెల 28వ తేదీన హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, రెడ్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజాన్ని చైతన్య పరచాలని ఆదేశాలు అందినట్లు తెలిపారు. ఈ మేరకు, మంచిర్యాల జిల్లా రెడ్ చైర్మన్ కే భాస్కర్ రెడ్డి, రెడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి మధుసూదన్ రెడ్డిలు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ చంద్రయ్య ఐఏఎస్ గారిని కలెక్టర్ ఛాంబర్లో కలిసి, ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, యువతను ఈ దురలవాట్ల నుంచి దూరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించినట్లు రెడ్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా యంత్రాంగం సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు.












