జైపూర్, జూలై 27
పంచాయతీ రాజ గరామీణాభవృదధ ాఖ ఆదేాల మేరు జైపూర మండల ేందరంలో అధారులు సబబంద ‘వసత భారత - గయారెంటీ ఫర రోజగార అండ ఆజీవ మషన గరామీణ చటటం 2025’ మరయు ‘జలసర’ పథాలపై షణ అవగాహన ారయరమం నరవహంచారు. ఈ ారయరమంలో పలువురు అధారులు పాలగొన సూచనలు చేారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆదేశాల మేరకు సోమవారం జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులకు, సిబ్బందికి ఒక్కరోజు అంతర్జాల శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికాసిత భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం 2025, ‘జలసిరి’ పనులపై ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు జలసిరి పథకం ద్వారా నీటి వనరుల సంరక్షణకు చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యతను వివరించారు. నిర్దేశిత లక్ష్యాలను అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సయీద, గౌసియా, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పర్యవేక్షకురాలు కె. గాయత్రి, సహాయ ఉపాధి పథక అధికారి బి. బాలయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రాజమౌళి, సహాయ వ్యవసాయ అధికారులు ఆకుల స్రవంతి, సంధ్యారాణి, అనూష, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.











