మంచేరియల్, జూలై 2026
చయల:జలలలో కాపుసంఘానికిసహకరించాలనిరాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ విజ్ఞప్తికార్యదర్శితోటశ్రీనివాస్విజ్ఞప్తి నషశఖశఇచచ.ననూషఉయషలోశననయూగల,ఎొననయల,ోలనచయలైచచచ.
మంచేరియల్ (ప్రజావార్త): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామిని, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కాపు సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తోట శ్రీనివాస్ తెలిపారు.
మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన అనంతరం తోట శ్రీనివాస్ మాట్లాడుతూ, కాపు సంఘం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సంఘం కార్యకలాపాలు, సభ్యుల సంక్షేమం కోసం మంత్రి సానుకూలంగా స్పందించారని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాపు సంఘం అభివృద్ధికి మంత్రి ఇచ్చిన హామీ పట్ల తోట శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సంఘం కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో జిల్లాలో కాపు సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.











