సింగరేణి సంస్థలో ఎస్.వి. రాజేశ్వరరావు శనివారం నాడు ఎస్టీపీ డిప్యూటీ పర్సనల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
బెల్లంపల్లి ఏరియా నుండి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) బదిలీపై వచ్చిన రాజేశ్వరరావు, ఎస్టీపీ ఇంచార్జ్ జీఎం మదన్ మోహన్‌ను కలిసి రిపోర్ట్ చేశారు.
జీఎం మదన్ మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి విధుల్లోకి ఆహ్వానించారు.
అనంతరం, ఎస్టీపీ ఈడీ సిహెచ్. చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధ్యతలు చేపట్టిన తర్వాత, పర్సనల్ విభాగం సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.








