భీమారం, జులై 02
భమారంగరామంోజాతయరహదారపసెంరపచేయకపోడంతోరాతరేళోపరమాదాజరగతాయ,పరజఇబబందపడతారసథాకయకతెపార.ఈసమసయపరషకరంచాకోరతూసరపంచఉషకమళళజయకషమకతపతరంఅందంచార.
భీమారం గ్రామంలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైట్లు వెలగడం లేదని, వాటిని సరిచేయాలని కోరుతూ భీమారం గ్రామానికి చెందిన యువకులు సర్పంచ్ ఉష్కమళ్ళ విజయలక్ష్మికి వినతి అందజేశారు.
గ్రామంలో రాత్రి సమయాల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు, పశువులు వాహనాలకు అడ్డురావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, పశువులు గాయపడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయని యువకులు తెలిపారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సరైన సెంట్రల్ లైట్ల సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాత్రి వేళల్లో ప్రయాణించడానికి భయపడుతున్నారని వివరించారు. కావున, రహదారి పక్కన పాడైపోయిన లైట్లను సరిచేసి, కొత్తవి ఏర్పాటు చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు.
ఈ కార్యక్రమంలో రాపెల్లి రాజన్న, రంజిత్, మహేష్, లక్ష్మి నారాయణ, విష్ణువర్ధన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.











