Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 27
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వేంపల్లి సమీపంలో ఆదివారం రవాణా శాఖ అధికారులు ఇసుక ట్రాక్టర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అధిక వేగంతో, అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను అడ్డుకొని, పత్రాలు సరిగా లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వేంపల్లి సమీపంలో ఆదివారం రవాణా శాఖ అధికారులు ఇసుక ట్రాక్టర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అధిక వేగంతో, అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని, పత్రాలను పరిశీలించారు.
సరైన పత్రాలు లేకుండా అధిక వేగంతో వెళ్తున్న 9 ట్రాక్టర్లపై అధికారులు కేసు నమోదు చేసి, వాటిని సీజ్ చేశారు. రాష్ట్ర ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఏ ఎం వి ఐ ఆఫీస్ ఆధ్వర్యంలో స్థానిక రవాణా శాఖ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ మాట్లాడుతూ, నిత్యం వందలాది ట్రాక్టర్లు అధిక వేగంతో వెళుతూ ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు.












