Mahabubnagar/Addakal (అక్షరవేకువ) జూలై 10
హణకయగజూహ.ఎకకూఎభూృహఖటట.ఉఘకఈ-,కఅకకకూ.
రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా జైపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్డు కూడలి వద్ద ఎస్సై భూమేష్ నేతృత్వంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలాన్ల వర్షం కురిపించడంతో పాటు, 'డ్రంక్ అండ్ డ్రైవ్' కేసులతో చుక్కలు చూపించారు. ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద భారీగా మోహరించిన పోలీస్ సిబ్బంది వాహనదారులకు చుక్కలు చూపించారు.
హెల్మెట్ లేని వారికి, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ఈ-చలాన్లు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డీడీ (DD) కేసులు నమోదు చేశారు. వాహనదారులను ఆపి, రోడ్డు భద్రతపై ఎస్సై స్వయంగా అవగాహన కల్పించారు.
"ప్రాణం చాలా విలువైంది. బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్, కార్లలో ప్రయాణించేటప్పుడు సీటుబెల్ట్ తప్పనిసరి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు మాట్లాడటం, మద్యం సేవించి స్టీరింగ్ పట్టడం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ కుటుంబాలను కూడా రోడ్డున పడేస్తుంది. ప్రతి ఒక్కరూ వేగ పరిమితిని పాటించి, ప్రమాద రహిత సమాజానికి సహకరించాలి," అని ఎస్సై భూమేష్ తెలిపారు.
రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.











