పశుసంవర్ధక శాఖను పటిష్టం చేసి గొల్ల, కురుమలను ఆదుకుంటామని, బీమా, సబ్సిడీ, రుణాల సదుపాయాన్ని కల్పిస్తామని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గత 10 ఏళ్ల ప్రభుత్వం గొల్ల, కురుమలను మోసగించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి, బీమా సదుపాయానికి కార్యచరణ చేసిందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణలో భాగమే కరీంనగర్లో సమావేశం జరిగినట్లు ర్యాలలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. గొల్ల, కురుమలకు బీమా సదుపాయంతో గొర్రెల ప్రమాదాలను నివారించవచ్చని, తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే బీమా సదుపాయంతో డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందని, ప్రమాదాలకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం పెట్టే చిన్న మొత్తంతో భీమాను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో కోతులు, కుక్కల బెడదలను నివారించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని, త్వరలోనే నివారణ ఏర్పాట్లపై దృష్టి సారిస్తామని మంత్రి శ్రీహరి చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ మధుకర్, సిటీ అధ్యక్షులు తూముల నరేష్, టిపిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.












