జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఎన్జీఓ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో నాయకులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
టీఎన్జీఓ నాయకులు ఎస్పీ పరితోష్ పంకజ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా బాధ్యులు నిర్మల రాజకుమారి, భాస్కర్, ప్రమోద్, మోహనప్ప, జగన్, యాదవరెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.












