మంచిర్యాలకు చెందిన MD ఖజామియాకు సామాజిక సేవలో విశిష్ట కృషికి గాను డాక్టరేట్ అవార్డు లభించింది. చెన్నైలో జరిగిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
MD ఖజామియా 2000 సంవత్సరంలో K.G.N. వాలంటరీ ఆర్గనైజేషన్ ను స్థాపించి, అప్పటి నుండి విద్య, బాలకార్మిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, మహిళా సాధికారత, నిరుద్యోగ యువతకు శిక్షణ వంటి అనేక రంగాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బాలకార్మిక పాఠశాలల స్థాపన, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేయడం, గ్రామాలలో అక్షరాబారతి కేంద్రాల ఏర్పాటు, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, నిరుద్యోగులకు కంప్యూటర్ కోచింగ్ వంటి కార్యక్రమాలు ఆయన సేవా నిరతికి నిదర్శనం.
గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ఖజామియా, ఈ అంతర్జాతీయ డాక్టరేట్ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ అవార్డు సామాజిక సేవలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నిలిచింది.












