తెలంగాణ రాష్ట్ర బట్రాజు సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ప్రక్రియ బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నమాధవుని జీవన్ రాజు, అడ్లూరి సత్యనారాయణ రాజుల పర్యవేక్షణలో నిర్వహించబడింది.
కొత్త కార్యవర్గంలో అధ్యక్షులుగా చక్రహరి సురేంధేర్రాజు, ఉపాధ్యక్షులుగా చన్నమాధవుని ప్రేధర్ రాజు, సరస్వతి విజయకుమార్ రాజు, ప్రధాన కార్యదర్శిగా అరవరాజు శ్రీనివాసరాజు, కోశాధికారిగా తుమికి ప్రవీణాజు ఎన్నికయ్యారు.
కార్యదర్శులుగా విలాసకవి వెంకటరాజు, తుమికి రవీందర్ రాజు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా గొల్లపల్లి దామోదర్ రాజు, సంస్కృతి కార్యదర్శులుగా వ్యాసభట్టు రాధాకిషన్ రాజు, ప్రసార కార్యదర్శులుగా బిరుదురాజు శ్రీధర్ రాజు, క్రీడల కార్యదర్శులుగా సిరికొండ వీరంద్ర రాజులు నియమితులయ్యారు.
కార్యనిర్వహణ సభ్యులుగా బ్రహ్మాండభేరి నాగరాజు, తంగెళ్ల పురుషోత్తం రాజు, చెన్నమదావుని సురేందర్ రాజు, కాసు శ్రీనివాస రాజు, విలాసకవి సత్యం రాజు, కూరపాటి గోపరాజులు, గౌరవ అధ్యక్షులుగా కేశిపెద్ది రామరాజు, గౌరవ సలహాదారుగా అడ్లూరి శ్రీనివాస రాజులు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అధికారులగా చెన్నమాధవుని జీవన్ రాజు, అడ్లూరి సత్యనారాయణ రాజు, అంబటి రవీందర్ రాజు, కేశిపెద్ది రామరాజు వ్యవహరించారు.












