మంచిర్యాల పట్టణ ఆటో రిక్షా వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు అంకతి సత్తయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అంకతి సత్తయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
యూనియన్ జిల్లా అధ్యక్షులు తూముల నరేష్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు బచ్చలి మల్లేష్, సుద్దాల రాజు, రాజా గౌడ్, చంద్రయ్య, రవి, హమీద్ లు సత్తయ్యకు నివాళులు అర్పించారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, సత్తయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సత్తయ్య సంఘానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.












