Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 10
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం దొంగతనం చేసిన కేసులో అంతర్ జిల్లా నేరస్తుడిని హాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.75 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్ గుడి పేట పునరావాస కాలనీ సిసిసి నస్పూర్ లలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం దొంగతనం చేసిన కేసులో అంతర్ జిల్లా నేరస్తుని అరెస్టు చేసినట్టు హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, 2026 మే 23, 24 తేదీల్లో కరీంనగర్ జిల్లా ఎల్లబోతారం గ్రామానికి చెందిన యాడపల్లి చందు, సిరిసిల్ల జిల్లాకు చెందిన మరో వ్యక్తి కలిసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును దోచుకెళ్లారని తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం హాజీపూర్ మండల కేంద్రంలో యాడపల్లి చందును పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3.75 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
గతంలో వివిధ నేరాల్లో అరెస్టు అయి కరీంనగర్ జిల్లాలో పరిచయమైన వీరిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిసి హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ పర్యవేక్షణలో హాజీపూర్ ఎస్సై ఈ కేసును దర్యాప్తు చేశారు.











