సంగారెడ్డి, 2026-08-08
దొంగిలించబడిన పోగొట్టుకున్న లను సరైన ధృవీకరణ లేకుండా కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం, మరమ్మతులు చేయడం చట్టరీత్యా నేరమని సంగా ఈ ను తప్పనిసరిగా పాటించాలని ఆమె
దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ లేకుండా కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం, మరమ్మతులు చేయడం చట్టరీత్యా నేరమని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొబైల్ డీలర్లు, రిటైలర్లు, సెకండ్‌హ్యాండ్ మొబైల్ షాపులు, రిపేర్ సెంటర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
సెకండ్ హ్యాండ్ మొబైల్ లావాదేవీకి ముందు పోర్టల్‌లో నంబర్‌ను తనిఖీ చేయాలని తెలిపారు. ప్రతి ఫోన్ వివరాలను నమోదు చేసి భద్ర పరచడంతో పాటు, విక్రేత పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి ఫోటో గుర్తింపు పత్రాలు, లైవ్ ఫొటోను సేకరించాలన్నారు. అన్ని లావాదేవీలకు సంబంధించిన ఇన్వాయిస్లు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, రిజిస్టర్‌ను భద్రపరచాలని సూచించారు.
బ్లాక్‌లిస్ట్ అయిన ఉన్న, యాజమాన్య ధ్రువీకరణ లేని లేదా చోరీకి గురైనట్లు అనుమానం ఉన్న ఫోన్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ లావాదేవీలు చేయరాదన్నారు. అనుమానాస్పద ఫోన్లు లభిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లేదా సైబర్ సెల్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 317, ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు.












