మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 28
మంచిర్యాల ఐబి హనుమాన్ ఆలయంలో హుండీ చోరీ జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆలయం వద్ద ఐమాస్ లైటింగ్ పనిచేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వంటి సమస్యలను నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ కొమురయ్య మేయర్ మధుకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మేయర్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంచిర్యాల నడిబొడ్డున ఐ.వి చౌరస్తాలో ఉన్న ఐబి హనుమాన్ ఆలయంలో హుండీ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆలయ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ కొమురయ్య, మేయర్ మధుకర్‌కు వివరించారు. ఆలయం వద్ద పనిచేయని ఐమాస్ లైటింగ్, సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మేయర్‌కు తెలిపారు.
మేయర్ మధుకర్ సమస్యలను సానుకూలంగా స్వీకరించి, సిబ్బందికి అక్కడి ఏర్పాట్లను పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఆలయ పరిసరాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు.












