జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 10న (శనివారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా అందిస్తున్న ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉదయం 10 గంటలకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ పేర్లను జాబితాలో చూసుకొని, కేటాయించిన కేంద్రాలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందించనున్న ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 10న (శనివారం) ఉదయం 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత జాబితాలో సరిచూసుకొని, తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, ఎస్ఐ/కానిస్టేబుల్ ప్రాథమిక దరఖాస్తు ఫారం ( ) తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల వివరాలు
కేంద్రం: పరీక్షా వేదిక సెయింట్ ఆంథోనీ హైస్కూల్, శాంతినగర్, . ఈ కేంద్రం పరిధిలోకి టౌన్, రూరల్, ఇంద్రకరణ్, సదాశివపేట, కొండాపూర్, బీడీఎల్ భానూర్, జిన్నారం, హత్నూర, గుమ్మడిదల, ఐడీఏ బొల్లారం, ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్లు వస్తాయి. అందోల్ కేంద్రం: పరీక్షా వేదిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జోగిపేట. ఈ కేంద్రం పరిధిలోకి జోగిపేట, పుల్కల్, వాట్పల్లి, నారాయణఖేడ్, మనూర్, నాగల్గిద్ద, కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ పోలీస్ స్టేషన్లు వస్తాయి. జహీరాబాద్ కేంద్రం: పరీక్షా వేదిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, జహీరాబాద్. ఈ కేంద్రం పరిధిలోకి జహీరాబాద్ టౌన్, జహీరాబాద్ రూరల్, కోహీర్, చిరాగ్పల్లి, ఝరాసంగం, హద్నూర్, రాయికోడ్, మునిపల్లి పోలీస్ స్టేషన్లు వస్తాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికే హాజరుకావాలి. పరీక్షకు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ప్రాథమిక దరఖాస్తు ఫారం తీసుకురావాలి. ఉదయం 10:00 గంటలకు పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండేలా ముందుగానే చేరుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర జిల్లాల అభ్యర్థులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అభ్యర్థులందరూ ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి, స్క్రీనింగ్ టెస్ట్‌కు సమయానికి హాజరుకావాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.












