జిల్లాలోని పి.ఎం.శ్రీ పాఠశాలల్లో వృత్తి విద్యా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ నుంచి 31వ తేదీ వరకు జిల్లా సైన్స్ సెంటర్లో జరిగింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వృత్తి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు, ఆసక్తి, సామర్థ్యాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా కిచెన్ గార్డెన్, హైడ్రోపోనిక్స్, టై అండ్ డై వంటి ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించవచ్చని శిక్షణలో వివరించారు. పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తులో ఉపాధికి, స్వయం ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎంవో బాలయ్య మాట్లాడుతూ, జిల్లాలో వృత్తి విద్యా కార్యక్రమం అమలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి లింబాజీ, డీఎస్వో సిద్ధారెడ్డి పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా కడియాల చంద్రశేఖర్, అప్పిరెడ్డి, వెంకటేశం, శ్రీశైలం, అనిల్, అశ్విని వ్యవహరించి ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.











