పారుపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది.
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ తోగర్ శ్రీనివాస్, MPO సార్, కార్యదర్శి తిరుపతి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సర్పంచ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. "వృక్షో రక్షతి రక్షితః" అనే నినాదంతో చెట్లను కాపాడడం అవసరమని చెప్పారు.












