SPSR Nellore/Udayagiri (అక్షరవేకువ) జూలై 01
జుమంచిర్యాల లైన్స్ క్లబ్ఆధ్వర్యంలో 1 న జరగనున్న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, మంచిర్యాలన్స్ క్లబ్బ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
జులై 1 న జరగనున్న జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctors Day) పురస్కరించుకొని, లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి రోడ్ లో ఉన్న మాత శిశు కేంద్రంలో (MCH) డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న 1. డాక్టర్ భీష్మ CS RMO, 2. డాక్టర్ శ్రీధర్ RMO, 3. డాక్టర్ గీతాంజలి ప్రొఫెసర్, ఆప్తమాలజీ డిపార్ట్మెంట్, 4. డాక్టర్ నాగ సింధుజ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబీజీ, 5. డాక్టర్ సౌమ్య క్యాజువాలిటీ డాక్టర్, 6. లయన్ డాక్టర్ జి వి ఎం ఎస్ చంద్రదత్ డాక్టర్లను పూలమాలతో అలంకరించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. మలబార్ గోల్డ్ వారు డాక్టర్స్ డే సందర్భంగా సమకూర్చిన బహుమతిని కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యత గురించి వక్తలు వివరించారు. డాక్టర్ బి సి రాయ్ (జననం జులై 1, 1882 - మరణం జులై 1, 1962) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 1991 సంవత్సరము జూలై 1 జాతీయ డాక్టర్స్ డే గా కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లయన్ తౌటం శ్రీనివాస్, కోశాధికారి లయన్ ఏ వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ జీవీఎంఎస్ చంద్రదత్, రీసన్ చైర్ పర్సన్ లయన్ చక్రధర్ రావు, జోన్ చైర్ పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ వి వినయ్ కుమార్, లైన్ ఎం రామాంజనేయులు, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, లయన్ దామోదర్, లయన్ పి ప్రభాకర్ రావు, లయన్ కె భాస్కర్ రెడ్డి, లయన్ కారుకూరి చంద్రమౌళి, చందూరి మహేందర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











