మండలం కోలంగూడలో నూతన మల్టీ పర్పస్ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఆదివాసులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకు టీకాలు ఇంటింటికి వెళ్లి అందించాలని అధికారులకు సూచించారు.
హాజీపూర్ మండలం ర్యాలీ పరిధిలోని కోలంగూడలో గురువారం మల్టీ పర్పస్ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. చిన్న పిల్లలకు వ్యాధి నిర్ధారణ టీకాలను వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని ఆయన సూచించారు. ఆదివాసులకు వైద్యం అందించేందుకు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభయాన్ పథకం కింద ఈ హెల్త్ సెంటర్ ను నిర్మించినట్లు తెలిపారు. గ్రామస్తులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గడుపురు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, మండలం వైద్యాధికారిణి డాక్టర్ లహరి, డాక్టర్ ఆదిత్య బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.












