ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని సున్నం బట్టి వాడలో ఉన్న లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణ మరియు వివిధ ప్రాంతాల నుండి దాదాపు 120 మంది ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు.
వారిలో 35 మందిని కంటి శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. వీరిని ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్ కు ఉచిత బస్సు, వసతి, భోజన సదుపాయాలతో తరలించి, ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి, వారిని మంచిర్యాలలోని స్వస్థలాలకు చేర్చడం జరుగుతుందని కార్యక్రమ కోఆర్డినేటర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి తెలియపరిచారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా, మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు లైన్స్ క్లబ్ సీనియర్ లైన్ మెంబర్ లయన్ సిహెచ్ నరసయ్య, లయన్ డాక్టర్ అభిషేక్, మరియు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ టెక్నికల్ పర్సన్ శంకర్ గార్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలకు కంటి చూపును అందిస్తున్న వారి సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఏ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా రెండవ ఉప గవర్నర్ లయన్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, లయన్ ఎం. వెంకటేశ్వర్లు, లయన్ సభ్యులు లయన్ సిరిపురం శ్రీనివాస్, లయన్ వినయ్ కుమార్, లయన్ ఇరుకుల ఆనంద్, లయన్ దామోదర్, లయన్ ఎస్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.











