మంచేరియల్, 13 November
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, కులమతాలకు అతీతంగా న్యాయం కోసం పోరాడటమే సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, కులమతాలకు అతీతంగా న్యాయం కోసం పోరాడటమే సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
15 వేల మంది సభ్యత్వం, 75 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ట్రేడ్ యూనియన్‌గా జర్నలిస్టుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని విరాట్ అలీ తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఐజేయూ, గొడుప్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి జర్నలిస్టుల నుంచి రాష్ట్రస్థాయి పాత్రికేయుల వరకు అందరి హక్కుల సాధనే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల డిమాండ్
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు అత్యవసరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి హామీలను అమలు చేయాలని విరాట్ అలీ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ నారాయణ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తామని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వానికి క్షీరాభిషేకం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి యు డబ్ల్యూ జే నేతలు పాల్గొన్నారు.






