ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తెలంగాణ మోడల్ మంగళవారం జరిగిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ పురస్కార కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వర్, ఎంపీడీవో ఎంఏ షరీఫ్, పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ అంజయ్య, ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, సమాజ నిర్మాణంలో వారి సేవలు అభినందనీయమని అన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం కలుగుతుందని వారు పేర్కొన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నర్సింలు, పంచాయతీ రాజ్ ఏఈ దేవయ్య, ఏవో సారిక, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేష్, బి.శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.












