ఆదిలాబాద్, 12 November
జిల్లా యాపగూడలోని 2వ బేటాలియం కార్యాలయంలో రెండు కుక్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా యాపగూడలోని 2వ బేటాలియం కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు కుక్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కామాండెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రూ. 15,600 వేతనం ఉంటుందని, యాపగూడ, జిల్లా పరిధిలోని స్థానికులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.






