సంగారెడ్డి, 12 November
లోని సీ.ఎస్.ఐ చర్చిలో గురువారం తెలంగాణ శాసనసభ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీ.ఎన్.జీ.ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.
సంగారెడ్డి సీ.ఎస్.ఐ చర్చిలో గురువారం తెలంగాణ శాసనసభ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీ.ఎన్.జీ.ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఉద్యోగుల సమస్యలు, ముఖ్యంగా పెండింగ్ డీఏ, పీఆర్సీ, జీపీఎఫ్, పింఛనుదారుల సమస్యలు, హాస్టల్ సంక్షేమ అధికారుల సమస్యలు, హెచ్ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ పూలింగ్ కింద ఉద్యోగులకు స్థలాల కేటాయింపు గురించి స్పీకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీ.ఎన్.జీ.ఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ. జావీద్ అలీ, కార్యదర్శి వి. రవి, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జి. శ్రీనివాస్, కోశాధికారి కసిని శ్రీకాంత్, నాల్గవ తరగతి ఉద్యోగుల అధ్యక్షులు షరీఫ్, టౌన్ అధ్యక్షుడు యాదవ రెడ్డి వెంకట్, టౌన్ కార్యదర్శి నాగమణి, వార్డు అధికారులు నవీన్, సాయి కిరణ్, రాజు, బిందు, రాధిక, రాజేశ్వరి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.






