మంచేరియల్, 13 November
రాజీవ్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని టౌన్-3 సెక్షన్లో నిర్వహించనున్న మరమ్మతు పనుల కారణంగా ఈ నెల 14వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
రాజీవ్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని టౌన్-3 సెక్షన్లో మరమ్మతు పనుల కారణంగా ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
ఈ అంతరాయం రాజీవ్ నగర్, తెలంగాణ నగర్, దొరగారిపల్లి, గాంధీనగర్, సప్తగిరి కాలనీ, హమాలివాడ, సూర్యనగర్, తిలక్‌నగర్, అశోక్ రోడ్, చిన్నబట్టివాడ, సాయికుంట, తిరుమలగిరి కాలనీ, శ్రీనగర్, ఎస్ఆర్ఆర్ కాలనీలలో ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
విద్యుత్ మరమ్మతు పనుల దృష్ట్యా ఆయా ప్రాంతాల వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఏడీఈ వేణుగోపాల్, ఏఈ మంచాల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.






