సంగారెడ్డి, 16 November
ఉద్యమ పంథాలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయుడబ్ల్యూజే) అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని టీయుడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యుడు వి.ఆనంద్ తెలిపారు. నూతనంగా జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ లు తనపై నమ్మకం ఉంచి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా యూనియన్ నాయకుల సహకారం మరువలేనిదని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర యూనియన్ వాణిని వినిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఆనంద్ తెలిపారు.






