హైదరాబాద్, 12 September
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్, వైస్ చైర్మన్ కొల్లకుంట నాగరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్, వైస్ చైర్మన్ కొల్లకుంట నాగరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రం కుల గణనలో ఓబీసీ కాలం చేర్చాలని కోరారు. బీసీ మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, సబ్సిడీ రుణాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు పెండింగ్ ఫీజులు ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడానికి నిరసించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసలకు తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజులను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలు తమ పిల్లలను చదివించాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవచ్చన్నారు. బీసీల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి బీసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో నాగేశ్వర రావు, రోహిత్, కౌటం రమేష్, రాజు బెస్త, నాగరాజు వడ్డేపల్లి తదితరులు పాల్గొన్నారు.












