హైదరాబాద్, 16 July
(ConfederationofaRealEstate&DevelopersAssociationofIndia)లఉలూ,ోేలోశలలోూలశలలేశ.ఈేశ,ఉలూలథలల.2027ఏలలోశలల.
CREDAI ( Confederation of a Real Estate & Developers Association of India) తెలంగాణ మాజీ ఉపాధ్యక్షులు వి మధుసూదన్ రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక కాబోతున్న శ్రీ గుమ్మి రామ్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2027 ఏప్రిల్ లో పదవిని స్వీకరించబోతున్న ప్రస్తుత క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా శ్రీ గుమ్మి రామ్ రెడ్డి కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా, దేశంలో మరియు రాష్ట్రంలో నిర్మాణ రంగం యొక్క స్థితిగతుల గురించి వారు చర్చించారు. వ్యవసాయం తర్వాత భారతదేశంలో నిర్మాణ రంగం అతిపెద్ద రంగమని, దీని ద్వారా కోట్ల మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని వి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రానికి సంబంధించి, నిర్మాణ రంగం ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోయినా, రాబోయే రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారధ్యంలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కలల స్వప్నమైన ఫ్యూచర్ సిటీ (Future City) నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్ సిటీ ద్వారా కొనసాగేలా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనివల్ల దక్షిణాదిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక మోడల్ సిటీగా రూపుదిద్దుకోబోతుందని ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు తెలియపరిచారు.












