అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం హెచ్చరించింది.
తమ సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ వేదికల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని, ఇందుకోసం కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
నకిలీ పీడీఎఫ్ (PDF) లను సృష్టించి, వాటి ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ పారదర్శకతతో ముందుకు సాగుతుందని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజల నమ్మకమే తమ బలం అని, ఆ నమ్మకాన్ని కాపాడుతామని హామీ ఇచ్చింది.
అడ్డంకులను దాటుకుంటూ అగ్రస్థానంలోకి దూసుకెళ్తున్న తమ ప్రయాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్న కుట్రలను భగ్నం చేస్తామని, న్యాయపరంగా ముందుకు వెళ్తామని సంస్థ యాజమాన్యం పేర్కొంది. తప్పుడు వార్తలకు చెక్ పెట్టి, చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించింది.











