జైపూర్, జూన్ 26
జైపూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మహమ్మద్ ఫయాజ్, శ్రీరాంపూర్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను ఖండించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నామనడం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తాము కేవలం కుటుంబ సభ్యులతోనే అసోసియేషన్ పెట్టలేదని, పలు గ్రామాల ఓనర్లు ఇందులో ఉన్నారని తెలిపారు.
నిన్న జరిగిన సంఘటనపై శ్రీరాంపూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు ప్రెస్ మీట్ పెట్టి చేసిన ఆరోపణలను ఉమ్మడి జైపూర్ మండల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫౌండర్ & చైర్మన్, ఇందారం సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ ఖండించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పేరు చెప్పి తాము బెదిరింపులకు గురిచేస్తున్నామనడం వాస్తవం కాదన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, తాను జైపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోడింగ్ కోసం పోరాడానని గుర్తుచేశారు. శ్రీరాంపూర్ అసోసియేషన్ వారే ప్రేమ్‌సాగర్ రావు పేరు చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాము కేవలం కుటుంబ సభ్యులతోనే అసోసియేషన్ పెట్టలేదని.. ఇందులో భీమారం, టేకుమట్ల, దుబ్బపల్లి, నర్సింగ్‌పూర్, ఇందారం తదితర గ్రామాల ఓనర్లు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. స్థానిక లోడింగ్ స్థానిక అసోసియేషన్ వాళ్లకు మాత్రమే కేటాయించాలని కోరారు.
నిన్నటిలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, 30% ఒప్పందం ప్రకారం కర్ర లోడింగ్‌ను జైపూర్ అసోసియేషన్‌కే కేటాయించాలని జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు.
అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలసాని భాస్కర్ రెడ్డి, సెక్రటరీ ఎండి. షార్ఫుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ఎండి. యాకూబ్లతో పాటు ఓనర్లు తిరుపతి, నరేష్, సతీష్, సాయి తదితరులు ఈ సమాచార సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.












