ధర్మారం (అక్షరవేకువ) ఆగస్టు 22
భీమారం మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను మండల ఎంపీడీఓ వీణ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆమె వివరాలు తెలుసుకున్నారు.

వనమహోత్సవంలో పాల్గొన్న ఎంపీడీఓ
అనంతరం, ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ వీణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న
ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ దాసరి మణిదీపక్, భీమారం మండల ఎంపీఓ సతీష్ రెడ్డి, ఏపీఓ జీనత్, మాజీ సర్పంచ్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు. విద్య, బాలల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ధర్మారం గ్రామ పంచాయతీ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా తెలిపారు.