మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 13
దేశవ్యాప్తంగా భూస్వాములకు భూ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయనుంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో భూ హద్దుల నిర్ధారణ ప్రక్రియను అత్యాధునిక రాడార్, జీపీఎస్ సాంకేతికతతో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని జాతీయ గ్రామీణ డెవలప్మెంట్ జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ తెలిపారు.
త్వరలో దేశమంతా భూస్వాములకు భూ ఆధార్ కార్డుల ప్రక్రియ వేగవంతం అవుతుందని, దేశంలోని29 రాష్ట్రాల్లో భూ హద్దుల నిర్ధారణ జరుగుతుంది అని, కేంద్ర ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ అయ్యాయని దానికి అనుగుణంగా అత్యాధునిక రాడార్ జిపిఎస్ విదేశీ టెక్నాలజీ తో గ్రాఫింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు, దీంతో వ్యవస్థతో భూ సమస్యలకు స్వస్తి పలకనున్నామని, 22 ఏ నిషేధిత భూముల క్రమాన్ని ఎప్పటికప్పుడు రికార్డులను ఫిల్టర్ చేయకపోవడమే కారణమని జాతీయ గ్రామీణ డెవలప్మెంట్ జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాలలో మాట్లాడారు. భూముల్లో మూడు భాగాలుగా ఉన్నాయని గ్రామీణ వ్యవసాయ భూములు, అర్బన్ నివాస స్థలాలు, పట్టణ భవన నిర్మాణ స్థలాలు ఉన్నాయి 3 కేంద్రాలుగా సాగే ఈ భూ ప్రక్రియను పూర్తిస్థాయిలో హద్దుల భూస్వాముల నిజనిర్ధారణతో ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు మాదిరిగానే భూమి కలిగిన భూస్వామికి (అల్ఫిన్) ప్రక్రియ ద్వారా భూ ఆధార్ కార్డు అందిస్తే సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెప్పారు.140 కోట్ల భారత వనిలో నెలకొన్న పూర్తి భూ సమస్యలను క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ అనంతరం ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని వెల్లడించారు. దీని మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నాయినీ ఆయన చెప్పారు.











