నస్పూర్, 13 September
అమెరికాలోని చికాగోలో మెట్రో స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి కోమాలోకి వెళ్లిన మంచిర్యాల విద్యార్థిని లగిశెట్టి స్పందన, చికిత్స అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అనంతరం స్వదేశానికి వచ్చిన *స్పందన, తల్లిదండ్రులు* ఈరోజు *మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు* గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన *లగిశెట్టి శ్రీనివాస్ గారి కుమార్తె లగిశెట్టి స్పందన* MS చదువుకునేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లడం జరిగింది.. 31-05-2026 రోజున *స్పందన* చికాగో లోని ఉన్న మెట్రో స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది,చికాగోలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు *మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు* గారికి చెప్పగానే వెంటనే స్పందించారు.. *స్పందన తల్లిదండ్రులు* తమ కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్లేందుకు అవసరమైన *పాస్పోర్ట్, వీసా* మంజూరు విషయంలో CMO అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవతో తేదీన *స్పందన తల్లిదండ్రులను* అమెరికాకు పంపించడం జరిగింది.. అంతేకాకుండా విమాన టికెట్లు మరియు ఇతర ఖర్చుల కోసం *రూ. 3,00,000/- ( మూడు లక్షల రూపాయలు)* ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.. ఎమ్మెల్యే గారి సహకారంతో అమెరికా వెళ్లి తమ కుమార్తె స్పందనను చూసుకుని, అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన *స్పందన , తల్లిదండ్రులు* ఈరోజు *మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు* గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, ఆపన్నహస్తం అందించిన *ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు* గారి మానవత్వానికి *స్పందన కుటుంబ సభ్యులు* హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.. స్పందన కుటుంబానికి అండగా నేను ఉన్నానని భరోసా కల్పించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామి, టీపీసీసీ సభ్యులు నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, నాయకులు కృష్ణారావు , తదితరులు పాల్గొన్నారు..











