MPUPS మద్దికల్ పాఠశాల, మద్దికల్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 05
మద్దికల్ యూపీఎస్ పాఠశాలలో వ తేదీ శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శ్రీ పోతేమ్ సమ్మయ్య ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
5th సెప్టెంబర్ శనివారం రోజున MPUPS మద్దికల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ పోతేమ్ సమ్మయ్య మొదటగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందర్నీ శాలువలతో ఘనంగా సన్మానించారు అలాగే పాఠశాలలో ఉన్న అంగన్వాడి మేడంను కూడా శాలువా తో సన్మానించడం జరిగింది ప్రీ ప్రైమరీ టీచర్ అపూర్వ కూడా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గొప్పదని కొనియాడారు అలాగే ఈరోజు పాఠశాల విద్యార్థులకు వచ్చిన యూనిఫామ్స్ ను విద్యార్థులకు పంచి పెట్టారు అందరికీ స్వీట్లు పంచడం జరిగింది . ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సర్పంచి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాడి జనార్ధన్ ఉపాధ్యాయులు సునీత భాగ్యలక్ష్మి ఆనంద్ అపూర్వ మేడం అంగన్వాడి వెంకటమ్మ మేడం పాల్గొన్నారు












