మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 22
రషటర మంతరి పొంేటి రజీనమ చేయని బీజేపీ రఘనథ రవరఘనథరవ డిమండ చేసింది. శనివరం కెకటరేట మటటడి బిజెపి నేత చేశర. మంచిరయో అధికర భజన పన సతోందని, పన యంతరంం జోకర మరిందని ఆరోపించింది. తమ పరజపరతినిధమని, ంజయి బయచ కదని, అధికర పకషనికి జోకర మరిన పోీస తీరన ఎండటటింది.
రాష్ట్ర మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం కలెక్టరేట్ ముట్టడి బిజెపి నేతలు చేశారు. మంచిర్యాలలో అధికారుల భజన పాలన సాగుతోందని, పాలన యంత్రాంగం జోకర్లుగా మారిందని ఆరోపించింది. తాము ప్రజాప్రతినిధులమని, గంజాయి బ్యాచ్ కాదని, అధికార పక్షానికి జోకర్లుగా మారిన పోలీసుల తీరును ఎండగట్టింది.
కలెక్టర్ తీరుపై విమర్శలు
కలెక్టర్కు కాంగ్రెస్ జీతం ఇస్తుందా అని ప్రశ్నించింది. ట్రాన్స్ఫర్ కాకుండా ఒకే చోట కలెక్టర్ ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించింది. ఈ క్రమంలో 10 మంది నేతలు లోనికి వెళ్లాలని ఎస్సై చెప్పగా, మొత్తం 30 మంది వెళ్తామని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేటు వద్ద వినతి పత్రాలు
చివరకు కలెక్టరేట్ గేటు వద్ద వినతి పత్రాలు సమర్పించిన బీజేపీ నేతలు, 22 ఏ తో అనేక భూ సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ జీవోతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను కష్టాలపాలు చేసిన 22 ఏ నిషేధం పేరిట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎందరో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రిపై తీవ్ర విమర్శలు
మంత్రి పొంగులేటిపై తీవ్ర స్థాయిలో బీజేపీ ఫైర్ అయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్, పట్టణ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి ఎలగందుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.












