మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 22
చీబధద,ెీోైదదఖ.ృ,థొ.
మంచిర్యాల రాజకీయాలకు తనకు సంబంధం లేదని, వర్గాలుగా కాంగ్రెస్ మంత్రిగా సంప్రదిస్తే స్పందిస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. వర్గాలకు, అసంతృప్తులకు అక్కడి నేతలే కారణమని, తనను శత్రువుగా భావించి విమర్శించినా మంత్రిగా తన పని తాను చేసుకుంటానని తెలిపారు. మంచిర్యాలలో కుంపట్లకు, వర్గాలకు అక్కడి నేతల వ్యవహరింపే కారణమని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ వంశీ, ప్రేమ్ సాగర్ రావు పై స్పందన
గూడెం అడ్డగింత విషయంలో ఎంపీ వంశీ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారని, విశాఖ ట్రస్ట్ ప్రైవేట్ ప్రోగ్రామ్ అని, ఎంపీగా నిర్ణయాలు, అనుభవాలు ప్రత్యక్షంగా చూసేందుకు ఎంపీ వంశీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాకా వెంకటస్వామి మనువడిగా, మంత్రి వివేక్ కుమారుడిగా కాకుండా గడ్డం వంశీగా పేరు పొందాలనేదే తన తపన అని అన్నారు. కాకా వెంకటస్వామికి పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లో ఫాలోవర్స్, ఫ్యాన్స్, పేదలు, అభిమానులు ఉన్నారని తెలిపారు. 444 కోట్ల బ్యాంకు రుణాల విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన పేరు తీసుకున్నప్పటికీ తనకు ఆయనతో వైరం లేదని, ఆయన వివరాలు, బ్యాంకుల వివరాలు తనకు తెలియదని స్పష్టం చేశారు.
చెన్నూరు అభివృద్ధి, యువతకు ఉపాధి
ప్రజల కొరకు, ప్రజల వద్ద అభివృద్ధి, సంక్షేమం, చెన్నూరులో యువతకు, కార్మిక ఉద్యోగ అవకాశాలు పెంచడమే ప్రధాన కర్తవ్యమని మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో, పారదర్శకంగా ముందుకు సాగుతూ చెన్నూర్, మెదక్ జిల్లాపై తన ఫోకస్ ఉంటుందని మంత్రి వివేక్ తెలిపారు.












