మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 23
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజకీయాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. సీనియర్ నేత మంతెన జగన్మోహన్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ఏడుగురు కార్పొరేటర్లు కలిసి ఆపరేషన్ ఆకర్ష పేరుతో కొత్త వ్యూహాన్ని రచించారు. మ్యాజిక్ ఫిగర్ 22 లక్ష్యంగా మరికొంతమందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మంచిర్యాల కాంగ్రెస్లో అసమ్మతి మరోసారి తారస్థాయికి చేరిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీనియర్ నేత మంతెన జగన్మోహన్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ఏడుగురు కార్పొరేటర్లు ఆపరేషన్ ఆకర్ష పేరుతో కొత్తవారికి గాలం వేసేందుకు సిద్ధమయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 22 లక్ష్యంగా మరికొంతమందికి వల వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
హైదరాబాద్కు నేతల పయనం
నాయకులు మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు కార్పొరేటర్లు, నాయకులు జగన్ వర్గం వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్కు వారి పయనం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో జిల్లా కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
అసమ్మతి తీవ్రత
పార్టీలో అసమ్మతి తీవ్రతను అధిష్టానం గుర్తించకపోతే మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకుల మధ్య సమన్వయ లోపం, స్థానిక నాయకత్వ వైఫల్యాలు పార్టీని బలహీనపరుస్తున్నాయని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












