మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 12
జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు శ్రీకాంత్ నకిలీ పట్టాలను చూపించి, రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పై అధికారుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
లో రిజిస్ట్రేషన్ దస్తావేజుల శ్రీకాంత్ మాయాజాలం... జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దొంగ పట్టాలను చూపించి, రిజిస్ట్రేషన్ల పేరుతో ఆశ చూపి డబ్బులు కాజేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే శ్రీకాంత్ అనే దస్తావేజు ఇటీవల కార్యాలయం తెరిచి, నకిలీ పట్టాలతో ఈ తతంగం నడుపుతున్నట్లు సమాచారం. పై అధికారి పేరుతో శ్రీకాంత్ ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్ దారులను మోసం చేస్తున్నాడు. నకిలీ పట్టాల మోసం సాగుతున్నట్లు తెలుస్తుంది. అత్యవసరదారులను ఆసరాగా చేసుకొని శ్రీకాంత్, నకిలీ పట్టా చూపించి ఒకరి వద్ద రూ. 40 వేలు కాజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పై అధికారుల పేరు చెప్పి, రిజిస్ట్రేషన్ దారుల నుండి రూ. 5.50 లక్షల వరకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ దారులకు కాలయాపన చేస్తూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అధికారుల స్పందన ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












