మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 18
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలకు చెందిన ఫోటోగ్రాఫర్ జక్కుల రాజు సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కథనం. అబ్బురపరిచే సజీవ చిత్రాలు, ఆకట్టుకునే డాక్యుమెంటేషన్ తో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సేవలందిస్తూ పలువురు కలెక్టర్లచే ప్రశంసలు అందుకుంటున్న రాజు, అరుదైన ఫోటోగ్రఫీతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలకు చెందిన ఫోటోగ్రాఫర్ జక్కుల రాజు సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కథనం. అబ్బురపరిచే సజీవ చిత్రాలు, ఆకట్టుకునే డాక్యుమెంటేషన్ తో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సేవలందిస్తూ పలువురు కలెక్టర్లచే ప్రశంసలు అందుకుంటున్న రాజు, అరుదైన ఫోటోగ్రఫీతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమా యాడ్స్ నిర్వాహకుడైన జక్కుల రాజు, తన అరుదైన ఫోటోగ్రఫీ నైపుణ్యంతో అందరి మనసులను ఆకట్టుకుంటూ, పలువురు కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నుండి ప్రశంసలు, సన్మానాలు అందుకుంటూ మంచిర్యాలలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అధికారుల ప్రశంసలు, సన్మానాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఇన్చార్జి పిఓ వరుణ్ రెడ్డి, రాజు చేసిన గాంధారి ఖిల్లా డాక్యుమెంటేషన్ ను తిలకించి, ఆయన అంకితభావాన్ని, అరుదైన ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని మెచ్చుకొని ఘనంగా సత్కరించారు. 2017లో అప్పటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్జన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయనకు ప్రతిభ ప్రశంస పత్రం అవార్డును అందజేశారు. మీకోసం అనే డాక్యుమెంటేషన్ ను చూసి ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ రాజును ప్రశంసించారు. మేడారం సమ్మక్క సారక్క జాతర మహోత్సవాలపై డాక్యుమెంటేషన్ చేసి గుర్తింపు పొందిన రాజు, రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొని ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. జిల్లాస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లోనూ పలుమార్లు అవార్డులు సాధించారు.
యువతకు మార్గదర్శి
అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండే రాజు, ఫోటోగ్రఫీ రంగంలో తనదైన శైలిని చాటుకుంటూ, ఎందరో యువకులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాలలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇరవై సంవత్సరాలకు పైగా ఈ రంగంలో సేవలందిస్తున్న ఆయన, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు అద్భుతమైన డాక్యుమెంటేషన్ అందిస్తూ, మంచిర్యాలలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించారు.
వివిధ శాఖలకు సేవలు
మున్సిపాలిటీ, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందిస్తూ, అద్భుతమైన డాక్యుమెంటేషన్ తో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉట్నూరు ఇన్చార్జి పిఓ వరుణ్ రెడ్డి, రాజు చేసిన గాంధారి ఖిల్లా డాక్యుమెంటేషన్ ను చూసి, ఆయన అంకితభావాన్ని, అరుదైన ఫోటోగ్రఫీ విధానాన్ని మెచ్చుకొని ఘనంగా సత్కరించారు. 2017లో అప్పటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్టన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆయనకు మంచిర్యాల జిల్లా ప్రతిభ ప్రశంస పత్రం అవార్డును ప్రధానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఆయన డాక్యుమెంటేషన్ అందించారు. సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలపై డాక్యుమెంటేషన్ చేసి గుర్తింపు పొందిన రాజు, రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొని బహుమతిని సొంతం చేసుకున్నారు. జిల్లాస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లోనూ పలుమార్లు అవార్డులు సాధించారు. అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండే రాజు, ఫోటోగ్రఫీలో తనదైన ముద్ర వేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మరిన్ని గుర్తింపులు పొందేందుకు కృషి చేస్తున్నారు.











