సంగారెడ్డి, 2026-08-20
భూ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్ తండ్రి అయిన పుల్లయ్యగారి అంజాగౌడ్ (96) గురువారం సంగారెడ్డిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
భూ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్ తండ్రి అయిన పుల్లయ్యగారి అంజాగౌడ్ (96) గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పుల్లయ్యగారి అంజాగౌడ్ తన జీవితాన్ని పేదలు, నిరుపేదల సంక్షేమం కోసం అంకితం చేశారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూమిలేని నిరుపేదలకు భూమి దక్కేలా తన వంతు కృషి చేశారు. భూమి లేని పేదలకు అండగా నిలిచి, వారి హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు.
తన సహచర నాయకులైన మాజీ ఎమ్మెల్యే కౌడిపల్లి విఠల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి, ప్రజల సమస్యలపై పోరాడారు.
మృతుడు పుల్లయ్యగారి అంజాగౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీడీసీ చైర్మన్ ప్రభు గౌడ్ తండ్రి. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.
పుల్లయ్యగారి అంజాగౌడ్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన కంది మండలం చిదురుప్ప గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.











