10/07/26 (అక్షరవేకువ) జూలై 10
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామచంద్ర రావు తన పదవీకాలంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను బీజేపీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు తన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేస్తున్న కృషిని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామచంద్ర రావు తన అధ్యక్ష పదవీకాలంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీజేపీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు తన స్వగృహంలో సత్కరించారు.
ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఒప్పించి, తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను తెలంగాణ మానస పుత్రిక అయిన సింగరేణి సంస్థకు అప్పగించారని, దీనికోసం బీజేపీ ఎనలేని కృషి చేసిందని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ఏ అంశంలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, పార్టీ నాయకులుగా మీరు కూడా జిల్లాలలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పనితీరు, నాయకత్వం, నరేంద్ర మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ప్రజా సమస్యలపై సత్వరమే స్పందిస్తూ, పార్టీని ముందుకు తీసుకుపోయి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, రాబోయే రోజుల్లో పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కష్టపడాలని రామచంద్ర రావు సూచించారు.












