ఈరోజు (అక్షరవేకువ) జూలై 09
MPUPS వాడగావ్ పాఠశాల విద్యార్థులందరికీ నాణ్యమైన స్కూల్ బ్యాగులు, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్బుక్లు, పెన్సిళ్లు, క్రేయాన్లు వంటి విద్యా సామగ్రిని ఈరోజు పంపిణీ చేశారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ పండిట్ మధనూరే ఈ సామగ్రిని ఉదారంగా విరాళంగా అందించారు. ఆయన సహకారం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
MPUPS వాడగావ్ పాఠశాలలోని విద్యార్థులందరికీ నాణ్యమైన స్కూల్ బ్యాగులు, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్బుక్లు, పెన్సిల్ పర్సులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు, క్రేయాన్లు మరియు ఇతర విద్యా సామగ్రిని ఈరోజు పంపిణీ చేశారు.
ఈ సామగ్రిని డాక్టర్ పండిట్ మధనూరే (విశ్రాంత శాస్త్రవేత్త) ఉదారంగా విరాళంగా అందించారు.
విద్యార్థుల విద్యకు, సర్వతోముఖాభివృద్ధికి ఆయన అందించిన అమూల్యమైన సహకారానికి, తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఆయన చేసిన ఈ గొప్ప పని వల్ల ప్రతి విద్యార్థి ముఖంలో ఆనందపు చిరునవ్వు వికసించిందని తెలిపారు.
డాక్టర్ పండిట్ మధనూరే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.











