జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా రూ. 1500 కోట్లు కేటాయింపుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీఓ జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఇది కేవలం అంచనాలు మాత్రమేనని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి భూసర్వే జరగలేదని, కేవలం అంచనాలు మాత్రమే రూపొందించామని ఆర్డీఓ జగదీశ్వర్ తెలిపారు. భూసేకరణ కోసం రూ. 1500 కోట్లు కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను చూసి రైతులు తమ నష్టపరిహారం విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, గోప్యత పాటిస్తూ, ఏదో కొంత చెల్లించి రైతుల భూములను లాక్కునే పరిస్థితి ఉండదని ఆర్డీఓ జగదీశ్వర్ హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాలను కాపాడతామని, న్యాయమైన నష్టపరిహారం అందేలా చూస్తామని ఆయన భరోసా కల్పించారు.












